- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
యూరియా అధిక ధరలకు విక్రయించబడుతున్నట్లు రైతుల నుండి ఫిర్యాదు అందడంతో పాటు, ఈ విషయం పై పత్రికల్లో వార్తలు ప్రచురించబడిన నేపథ్యంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ కృష్ణయ్య మంగళవారం షాపును తనిఖీ చేశారు. డీలర్ సమక్షంలోని ఎరువులను చేశారు. విచారణ అనంతరం తుది నివేదికను ఎరువుల లైసెన్సింగ్ అథారిటీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా ఎరువుల లైసెన్సింగ్ అథారిటీ అయిన వ్యవసాయ సహాయ సంచాలకులు చంద్రశేఖర్ సంబంధిత డీలర్‌పై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లైసెన్స్ రద్దు ఆర్డర్ జారీ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఎరువుల అధిక ధరల విక్రయం మరియు అక్రమ బిల్లుల జారీ వంటి చర్యలపై వ్యవసాయ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
- Advertisement -