Wednesday, October 8, 2025
E-PAPER
Homeబీజినెస్బయోమెట్రిక్‌తోనూ యూపీఐ చెల్లింపులు..!

బయోమెట్రిక్‌తోనూ యూపీఐ చెల్లింపులు..!

- Advertisement -

న్యూఢిల్లీ : యూపీఐలో త్వరలోనే పిన్‌ లేకుండానే బయోమెట్రిక్‌తో చెల్లింపులు చేసే విధానం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ముఖ గుర్తింపు, ఫింగర్‌ప్రింట్‌తోనూ లావాదేవీలు పూర్తి చేసేలా కీలక మార్పునకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కసరత్తును పూర్తి చేసిందని సమాచారం. దీనికి సంబంధించి అక్టోబర్‌ 8న ఎన్‌పీసీఐ ప్రకటనలను విడుదల చేయనుందని రాయిటర్స్‌ వెల్లడించింది. యూపీఐ చెల్లింపులకు పిన్‌తో పాటు ప్రత్యామ్నాయ విధానాలు కూడా ఉండాలని ఆర్‌బీఐ ఇటీవల సూచించిన విషయం తెలిసింది. ప్రస్తుతం యూపీఐలో 4 లేదా 6 అంకెల పిన్‌ స్థానంలో ఇతర ఆప్షన్లు కూడా ఉండాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్‌ వివరాలతో పేమెంట్స్‌ చేసే సదుపాయాన్ని ఎన్‌పిసిఐ ఆవిష్కరిస్తోందని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -