సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా
నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కీలకం అని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా అన్నారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో నియుక్తులైన ప్రిసైడింగ్ అధికారులకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికార్లకు డివిజన్ స్థాయిలో బుధవారం పట్టణంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఎన్నికలు సజావుగా సాగాలి కాబట్టి ఎన్నికలలో పాలుపంచుకున్నా మీరందరూ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న,డి ఎల్ పి ఓ శివకృష్ణ, ఎంపీడీవో శివాజీ, భీమ్గల్ , ఆలూరు, బాల్కొండ ఎంపీడీవోలు సంతోషకుమార్, గంగాధర్, విజయ భాస్కరరెడ్డి,, ఎంపీ ఓ శ్రీనివాస్, ఎం ఈ ఓ రాజగంగారం, ఆర్. పి లు గంట అశోక్, రాము,సంగెం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కీలకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES