నవతెలంగాణ – నసురుల్లాబాద్
పురిటి నొప్పులతో సతమతమవుతున్న మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన సప్టే విజయలక్ష్మి (26) అనే మహిళ బుధవారం ఉదయం పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా బంధువులు చిలుకూరు ‘108’కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది గర్భిణిని ఆస్పత్రికి తీసుకొస్తుండగా నొప్పులు అధికం కావడంతో బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామ శివారులో వాహనం ఆపి వాహనంలోని ఈఎంటీ రవి, పైలెట్ సతీష్ తన విధుల్లో భాగంగా మహిళకు ప్రసవం చేశారు. పండంటి అమ్మాయి ప్రసవించింది. తరువాత వారు తల్లీ బిడ్డను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన 108 వాహన సిబ్బందికి , బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
108లో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES