నవతెలంగాణ – హైదరాబాద్ : గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2025లో,ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే (PhonePe PG), జియో హాట్‌స్టార్ సహకారంతో, రూపే క్రెడిట్ కార్డ్‌లపై UPI ఆటోపే ద్వారా ఆధారితమైన సబ్‌స్క్రిప్షన్ ఐక్యూని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ఫోన్‌పే పీజీ, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ఆధారితమైన UPI ఆటోపే మ్యాండేట్‌లను అందించడానికి వీలు కల్పిస్తుంది, ఇది కస్టమర్‌లు పదేపదే పేమెంట్లను నిర్వహించడానికి అనుకూలమైన మార్గాన్ని సృష్టిస్తుంది.
సాంప్రదాయకంగా, UPI మ్యాండేట్‌లు నేరుగా బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయబడేవి. దీని వాళ్ళ , డెబిట్ తేదీన అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే పేమెంట్లు విఫలమయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు, రూపే క్రెడిట్ కార్డులపై UPI ఆటోపేను ప్రారంభించడం ద్వారా, వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్ పేమెంట్లను క్రెడిట్ లైన్ ద్వారా రూట్ చేసుకునే సౌకర్యం పొందారు. దీనివల్ల, నిధులు చాలక రెన్యూవల్స్ విఫలమవుతాయనే ఆందోళన లేకుండా, జియో హాట్‌స్టార్ వంటి సేవలకు నిరంతరాయంగా యాక్సెస్ లభిస్తుంది.
మర్చంట్‌లకు అలానే బిజినెస్‌లకు, ఇది తక్కువ పేమెంట్ వైఫల్యాలు, తక్కువ కస్టమర్ డ్రాప్-ఆఫ్‌లు అందించి, సరళమైన సబ్‌స్క్రిప్షన్ అనుభవానికి కలిగించవచ్చు. ఇది తరచుగా చేసే పలు పేమెంట్ పద్ధతులకు మద్దతు ఇస్తుంది – UPI ఆటోపే నుండి eNACH, అలానే కార్డ్ ఆధారంగా తరచుగా చేసే బిల్లింగ్ వరకు, బిజినెస్‌లకు అన్ని రకాల సబ్‌స్క్రిప్షన్ పేమెంట్లను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒకే వేదికను ఇస్తుంది.
ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే & ఆన్‌లైన్ మర్చంట్స్ హెడ్ అంకిత్ గౌర్ ఇలా వ్యాఖ్యానించారు: “ఈ లాంచ్‌తో, తరచుగా చేసి పేమెంట్లను నిర్వహించడానికి, వినియోగదారులకు మేము సరళమైన ఇంకా నమ్మదగిన మార్గాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారు ఒకసారి ఆటోపేను సెటప్ చేయవచ్చు, సేవలకు అంతరాయం లేని యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు, అలానే వారి ఎంపిక ప్రకారం ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. మర్చంట్‌లకు, ఈ ఫీచర్ అధిక పేమెంట్ విశ్వసనీయతను, అలానే సులభమైన లావాదేవీలను అందిస్తుంది. UPI ఆటోపేకి రూపే క్రెడిట్ కార్డులను తీసుకురావడం ద్వారా, వినియోగదారులకు సులభంగా, బిజినెస్‌లకు నమ్మదగినదిగా, అలానే విస్తరణకు అనుకూలంగా నిర్మించబడిన ఒక సొల్యూషన్ని మేము ఈ ఎకోసిస్టమ్‌కు అందిస్తున్నాము.
జియో హాట్‌స్టార్ ప్రతినిధి మాట్లాడుతూ “జియో హాట్‌స్టార్‌లో, మా సబ్‌స్క్రైబర్‌లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినోద అనుభవాన్ని అందించడమే మా ప్రాధాన్యత. ఈ భాగస్వామ్యం మా వినియోగదారులు తమకు ఇష్టమైన షోలు ఇంకా సినిమాలకు అంతరాయం లేకుండా యాక్సెస్ చేసేలా సహాయపడుతుంది అలానే సబ్‌స్క్రిప్షన్ పేమెంట్లకు సౌకర్యం, ఇంకా విశ్వసనీయత రెండింటినీ తీసుకువస్తుంది, కస్టమర్‌లు తాము ఇష్టపడే కథలతో కనెక్ట్ అవ్వడాన్ని గతంలో కంటే సులభతరం చేస్తుంది” అని అన్నారు.
ఈ కొత్త సామర్థ్యం త్వరలో ఫోన్‌పే పీజీ యొక్క సబ్‌స్క్రిప్షన్ సూట్ ద్వారా మరిన్ని బిజినెస్‌లకు అందుబాటులోకి వస్తుంది, ఇది భారతదేశం అంతటా మరింత నమ్మదగిన అలానే కస్టమర్‌కి అనుకూలంగా ఉండేలా వారు తరచూ చేసే పేమెంట్లకు మార్గం సుగమం చేస్తుంది.
ఫోన్‌పే గురించి: ఫోన్‌పే లిమిటెడ్ (గతంలో ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్) అనేది పేమెంట్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు & మార్కెట్‌ప్లేస్ సొల్యూషన్స్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించే ఒక టెక్నాలజీ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంది. ఫోన్‌పే డిజిటల్ పేమెంట్స్ యాప్‌ను 2016లో ప్రారంభించారు. మార్చి 31, 2025 నాటికి, ఫోన్‌పే డిజిటల్ పేమెంట్ యాక్సెప్‌టెన్స్ నెట్వర్క్‌లో 61 కోట్లకిపైగా రిజిస్టర్ అయిన యూజర్లు, 4.4 కోట్లపైగా మర్చంట్లు ఉన్నారు.
ఫోన్‌పే ప్రోడక్టులు, సర్వీసులలో కన్స్యూమర్ పేమెంట్లు (డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసులతో సహా), మర్చంట్ పేమెంట్లు, లెండింగ్, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసులు, న్యూ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లలో షేర్.మార్కెట్ (స్టాక్ బ్రోకింగ్ & మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారమ్), Pincode (స్థానిక ఆఫ్‌లైన్ స్టోర్‌లతో వినియోగదారులను కనెక్ట్ చేసే ఓమ్ని-ఛానెల్ హైపర్‌లోకల్ కామర్స్ ప్లాట్‌ఫామ్), ఇండస్ యాప్‌స్టోర్ (ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ మార్కెట్‌ప్లేస్) ఉన్నాయి.