నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) సీనియర్ నేత తేజస్వీయాదవ్ రెండు స్థానాల నుండి బరిలోకి దిగనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ఆర్‌జెడి కంచుకోట అయిన రఘోపూర్ స్థానం నుండి, మధుబనిలోని పుల్పరాస్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పుల్పరాస్ నియోజకవర్గంలో జెడి(యు) పార్టీకి చెందిన షీలా కుమారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి కృపానాథ్ పాఠక్ (కాంగ్రెస్) సుమారు 11,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2010 నుండి జెడి(యు) ఈ స్థానంలో గెలుస్తూ వస్తోంది. ఈ సీటులో ఆర్‌జెడి గెలుపొందితే జెడి(యు)కి గట్టి ఎదురు దెబ్బ అవుతుందని, తమ పార్టీ నైతిక బలాన్ని పెంచుతుందని తేజస్వీయాదవ్ భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీయాదవ్ రఘోపూర్ అసెంబ్లీ సీటు నుండి బిజెపి అభ్యర్థి సతీష్‌కుమార్‌ను ఓడించి 38,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
రెండు స్థానాల నుండి బరిలోకి దిగనున్న తేజస్వీయాదవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES