Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విత్తనోత్పత్తి క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

విత్తనోత్పత్తి క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలో వివిధ గ్రామాల్లో ” ప్రతి గ్రామంలో నాణ్యమైన విత్తనం” అనే కార్యక్రమంలో భాగంగా వరి, పెసర విత్తనోత్పత్తి క్షేత్రాలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, యాదాద్రి భువనగిరి, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ డి శ్రీలత, డాక్టర్ బి అనిల్ కుమార్ వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ క్షేత్ర సందర్శనలో  శాస్త్రవేత్తల బృందం రైతులకు విత్తనోత్పత్తిలో మెలకువలను తెలిపారు. “ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం”కార్యక్రమంలో భాగంగా ఈ వానకాలం జూన్ మొదటి వారంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రాల్లో అభివృద్ది  చేసిన నాణ్యమైన  వరి ( కె.ఎన్.ఎమ్ 1638 రకం), పెసర (యం.జి.జి 295) విత్తనాలను  ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు.

రైతులకు ప్రభుత్వం సన్న ధాన్యం పై రూ.500 బోనస్ అందిస్తున్నందున, ప్రస్తుత యాసంగి సీజన్లో కూడా కె.ఎన్.ఎమ్. 1638 వరి రకాన్ని సాగు చేయవచ్చన్నారు. రైతులు ప్రతి సీజన్లో విత్తనాన్ని  కొనకుండా, కె.ఎన్.ఎమ్ 1638 వరి,  యం.జి.జి 295 పెసర రకాన్ని అభివృద్ధి చేసుకొని  విత్తనాలుగా వాడుకుంటే, విత్తన పెట్టుబడి మిగలడమే కాకుండ అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అదికారులు క్రాంతి, సరిత, అభ్యుదయ రైతులు జంగా రవి, రూప్ సింగ్, బాల్ రెడ్డి, రామ్ రెడ్డి, నర్సింహ్మ  రెడ్డి, వెంకమ్మ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -