Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభ్యర్థుల ఎంపికపై కసరత్తు!

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు!

- Advertisement -

పోటీ చేసేందుకు అచితూచి అడుగులు వేస్తున్న ఆశావహులు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీటీసీలు,సర్పంచ్ లు, జెడ్పీటీసీ, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆశావహులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మండలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దానికి తోడు బీజేపీ సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నిచోట్ల అభ్యర్థులను బరిలో దింపడానికి సిద్ధమవుతోంది. మూడు పార్టీలు జెడ్పీటీసీ,ఎంపీపీతో పాటు అధిక స్థానాల్లో సర్పంచ్ లను కైవసం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు.

ముఖ్య నాయకులతో సమావేశాలు..

ఇటీవల విడుదలైన ఎన్నికల గెజిట్ మేరకు జెడ్పీటీసీ ఎస్సి మహిళ జనరల్,ఎంపీపీ ఎస్సి  మహిళ ఉంది. దీంతో కచ్చితంగా రెండు స్థానాలను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికలో అచీతూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రెండు స్థానాలకు అన్ని పార్టీలు ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులను గుర్తించి వారిలో ఒకరిని ఫైనల్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. రిజర్వేషన్లను పంచాయతీల వారీగా ఇప్పటికే పదవులను ఆశిస్తున్న నాయకులు, అభ్యర్థులు పార్టీల్లో ప్రధాన నాయకులతో సమావేశమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -