Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయూ లక్ష్యం

ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయూ లక్ష్యం

- Advertisement -

జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి 
నవతెలంగాణ – పెద్దవంగర

ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా పీఆర్టీయూ పని చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి అన్నారు. మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం కిష్టు తండా ప్రాథమిక పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి చాగార్ల ముడి శ్రీధర్ తో కలిసి మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డుల సాధనకు పీఆర్టీయూ కృషి చేస్తుందన్నారు. 317 బాధితులను దశలా వారీగా వారి సొంత జిల్లాలకు పంపించడం లోనూ పీఆర్టీయూ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

అనంతరం మండల ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ యాకూబ్ పాషా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల గెజిటెడ్ హెచ్ఎం గా పదోన్నతి పొందిన సురేష్ తో పాటుగా, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్నికల బాధ్యులు గొట్టి ముక్కుల శ్రీనివాస్ రెడ్డి, బూసాని సోమయ్య, రాష్ట్ర బాద్యులు శివరాత్రి అంజయ్య, జిల్లా, మండల బాధ్యులు విద్యా సాగర్, బాలరాజు, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, బోనగిరి వేణు మాధవ్, వెంకట శ్రీనివాస్ రావు, రవి, కవిరాజు, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సురేష్, ప్రదీప్, సురేందర్, వాణి, సువర్ణ, మహబూబీ రామతార తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -