Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి.!

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి.!

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి..
నవతెలంగాణ – మల్హర్ రావు

త్వరలో జరగనున్న  స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి బిఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బుధవారం బిఆర్ఎస్ పార్టీ తాడిచెర్లలో గడపగడపకు“కాంగ్రెస్ బాకీ కార్డు”పంపిణీ చేశారు.అనంతరం బిఆర్ఎస్ నాయకుల సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో  ఇచ్చిన ఆరు గ్యారంటీ ఇచ్చి గద్దెనెక్కిన తరువాత అమలు ఎందుకు చెయ్యలేదో కాంగ్రెస్ నాయకులను నిలదీయ్యాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “కాంగ్రెస్ బాకీ కార్డు”తో ఇంటింటికీ ప్రచారం చేసి ప్రజలకు గుర్తు చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు,బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్ తోపాటు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -