Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థి మృతిపై విచారణ జరిపి నిజాలు తేల్చాలి 

విద్యార్థి మృతిపై విచారణ జరిపి నిజాలు తేల్చాలి 

- Advertisement -

– విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి 
– తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బత్తుల అభిషేక్ భాను 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి వివేక్ మృతి చెందడంపై ఉన్నత అధికారులు విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు  బత్తుల అభిషేక్ భాను డిమాండ్ చేశారు. బుధవారం హుస్నాబాద్ తహసిల్దార్ లక్ష్మారెడ్డికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ విద్యార్థి మృతి పై పూర్తి విచారణ చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్ భాను  మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పద మృతికి కారణమైన వాళ్ళని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. బడికి పంపిన పిల్లలు విగతజీవులుగా మారుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదా అని ప్రశ్నించారు. విద్యార్థి వివేక్ అనుమానాస్పద మృతికి కారణం ఏమిటో అధికారులు  తేల్చలేకపోతున్నారన్నారు.

గురుకులాల్లో మరణ మృదంగం జరుగుతుంటే ప్రభుత్వం గురుకులాల నిర్వహణ గాలికి వదిలేసిందన్నారు. గురుకుల వ్యవస్థనే కుప్ప కూల్చే విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు.అభం శుభం తెలియని విద్యార్థి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతే ఒక్క అధికారి వచ్చి చూసిన పాపాన పోలేదన్నారు.  జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే గురుకులం సందర్శించాలని, మృతి పట్ల విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని, ఘటనకు బాధ్యత వహించి విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఎస్ ఎఫ్ ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోనేరు ప్రవీణ్ ,లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -