Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్7వ బెటాలియన్ లో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాలు

7వ బెటాలియన్ లో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7 వ బెటాలియన్ డిచ్ పల్లి కమాండెంట్ దంపతులు భవాని – సత్యనారాయణ ఆధ్వర్యంలో బెటాలియన్ ఆవరణలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వనవిహారం, చక్క స్నానం ఘనంగా నిర్వహించారు. బుధవారము ఉదయం నిత్య ఆరాధన, హవనము. శేషహ హోమము, వూర్ణాహుతి హోమము మధ్యాహ్నం 12.00 నుండి 2.00 వరకు వనవిహారము (అవబృదము) చక్రస్నానము, స్నపన తిరుమంజనము నివేదన, హారతి తీర్థగోష్టి,శ్రీ పుష్పయాగము ఆవాహిత దేవతోధ్యాసనము, ద్వజా అవరోహణము, సప్తవరణ పూజలు, ఏకాంతసేవ తీర్థ గోష్ఠి, అచార్య ఋత్విక్, సన్మానం, యజమానులకు ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ కమాండెంట్ సిహెచ్ సాంబశివరావు దంపతులు, అసిస్టెంట్ కమాండెంట్స్  కె.పి సత్యనారాయణ, అర్ ఎస్ ఐ లు, సిబ్బంది కుటుంబ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -