Thursday, October 9, 2025
E-PAPER
Homeసినిమా'వా..వాతియార్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘వా..వాతియార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

హీరో కార్తి నటిస్తున్న మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ ‘వా.. వాతియార్‌’. ఈ సినిమాను డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ కథతో దర్శకుడు నలన్‌ కుమారస్వామి దీన్ని రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా హీరో కార్తి నటిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కార్తి కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఇది నిలుస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

‘ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు, సినిమాలతో కార్తి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే ఇదొక మరో భిన్నమైన సినిమా. ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు’ అని మేకర్స్‌ తెలిపారు. సత్యరాజ్‌, మధుర్‌ మిట్టల్‌, ఆనంద రాజ్‌, రాజ్‌ కిరణ్‌, శిల్పా మంజునాథ్‌, కరుణాకరణ్‌ నటిస్తున్న ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ – జార్జ్‌ సి.విలి యమ్స్‌, ఎడిటింగ్‌ – వెట్రే కృష్ణన్‌, మ్యూజిక్‌ – సంతోష్‌ నారాయణన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -