- Advertisement -
ఢిల్లీపై 3-0తో అద్భుత విజయం
ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2025
హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో ముంబై మీటియర్స్ దూకుడు కొనసాగుతోంది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఢిల్లీ తుఫాన్సతో జరిగిన మ్యాచలో ముంబై 3-0 (15-12, 15-10, 15-11)తో విజయం సాధించింది. ముంబై కెప్టెన్ అమిత గులియా, స్టార్ ప్లేయర్ శుభం చౌధురి దూకుడైన ఆట తీరు ఢిల్లీ జట్టును విజయానికి దూరం చేశాయి. ఆట కీలక సమయాల్లో ముంబై ఆటగాళ్లు బలమైన సర్వీసులతో పాటు గ్యాప్ షాట్లు కూడా బాగా కొట్టడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడి పాయింట్లు కోల్పోయింది. ముంబై ఆటగాడు వసంతకు ‘మ్యాన ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
- Advertisement -