– వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై నిషేధం
– కలవరపడుతున్న అనేక రాష్ట్రాలు
– ఆందోళనలో అగ్రరాజ్యం అన్నదాతలు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై భారీగా సుంకాలు వడ్డించారు. తమ వస్తువులను కొనుగోలు చేయాలని అనేక దేశాలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భారత్ సహా పలు దేశాలు పలు అమెరికా ఉత్పత్తులకు తమ మార్కెట్ల తలుపులు బార్లా తెరిచాయి. కానీ ఒకే ఒక దేశం…చైనా మాత్రం వేరే దారిని ఎంచుకుంది. దీంతో అమెరికా గ్రామీణ వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఎందుకంటే అమెరికా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు నిన్నటి వరకూ చైనా ప్రధాన గమ్యస్థానంగా నిలిచింది. అయితే ఇటీవల అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులను తిరస్కరించింది. దీంతో అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలు కలవరపాటుకు గురవుతున్నాయి.
ట్రంప్ బెదిరింపులకు ప్రతిగా…
అమెరికా నుంచి పంది మాంసం, మొక్కజొన్న, పౌల్ట్రీ తదితర ఉత్పత్తుల దిగుమతులను కూడా చైనా నిలిపివేసింది. చైనా వస్తువులపై 140 శాతానికి పైగా టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికతో కథ మొదలైంది. రష్యా, బ్రెజిల్, భారత్, చైనాతో కూడిన బ్రిక్స్ దేశాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో రష్యా మినహా బ్రెజిల్, భారత్ ప్రధాన బాధితులుగా మారాయి. చైనా మాత్రం వ్యవసాయ-దౌత్య విధానాన్ని దూకుడుగా అనుసరిస్తూ టారిఫ్ విధింపునకు ముందు అమెరికా నుంచి అనేక గడువు ‘పొడిగింపులు’ పొందింది.
నిలిచిపోయిన సోయాబీన్ దిగుమతులు
చైనా ఇలా దూకుడుగా ఎలా వ్యవహరించగలు గుతోంది? సోయాబీన్ దిగుమతులను నిలిపివేయడం ద్వారా అమెరికా ఆయువు పట్టుపై చైనా దెబ్బ కొట్టింది.
ముఖ్యంగా సోయాబీన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న ఇల్లినాయిస్ (16 శాతం), లోవా (14 శాతం), ఇండియానా (8 శాతం), మిన్నెసోటా (8 శాతం), ఓహియో (8 శాతం) ప్రాంతాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రాష్ట్రాలలో 118.84 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ ఉంది. ఉత్తర డకోటా వంటి రాష్ట్రాలు జన్యుపరంగా అభివృద్ధి చేసిన తమ సోయాబీన్‌లో 70 శాతాన్ని చైనాకే పంపుతున్నాయి. ఇప్పుడు చైనా ఒకే ఒక్క దిగుమతి నిషేధాన్ని విధించడంతో చైనా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వణికిపోతోంది.
ట్రంప్ ఓటు బ్యాంకుపై దెబ్బ
సోయాబీన్ తర్వాతి స్థానం మొక్కజొన్నది. అమెరికాలో మొక్కజొన్నను కూడా గణనీయంగానే పండిస్తారు. దాని దిగుమతులపై సైతం చైనా నిషేధం విధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా మొక్కజొన్నను పండించే అమెరికా పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది. అమెరికా దిగుమతులపై నిషేధం విధిం చడం ద్వారా ట్రంప్ అను కూల రాష్ట్రాలైన లోవా, ఇల్లినాయిస్, నెబ్రాస్కా, మిన్నె సోటా, ఇండి యానా, ఉత్తర డకోటా, కనాస్ వంటి రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లు తోంది. అమెరికా మొక్క జొన్నను ఎక్కువగా దిగు మతి చేసుకునేది చైనాయే. ఇప్పుడు దానిని చైనా తిరస్కరించడంతో ట్రంప్ ఓటు బ్యాంకుకు భారీగానే చిల్లు పడవచ్చు.
పౌల్ట్రీ, పంది మాంసం దిగుమతులు సైతం…
అమెరికా పౌల్ట్రీ, పందిమాంసం దిగుమతులపై కూడా చైనా నిషేధం విధించడంతో అగ్రరాజ్యం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అమెరికాలో జన్యుపరంగా అభివృద్ధి చేసిన మొక్కజొన్నలో ఎక్కువ భాగం జంతువుల పెంపకానికి వినియోగిస్తారు. అయితే తాజాగా 12 వేలకు పైగా మెట్రిక్ టన్నుల అమెరికా పంది మాంసం దిగుమతులకు చైనా నిరాకరించింది. చైనాకు మాంసం ఎగుమతులు తగ్గిపోతే అమెరికాలో దానిని ఉత్పత్తి చేస్తున్న రైతులు దెబ్బతింటారు. వారి ఆదాయాలపై నేరుగా ప్రభావం పడుతుంది. మొక్కజొన్న కొనుగోలును నిరాకరించడం ద్వారా అమెరికాపై దాడిని చైనా తీవ్రతరం చేసిందనే చెప్పాలి. మొక్కజొన్నను అధికంగా ఉత్పత్తి చేస్తున్న కాన్సాస్, టెక్సాస్ రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడబోతోంది.
భారత్ ఏం చేయాలంటే
మరి ఇప్పుడు భారత్ ఏం చేయాలి? ఇటు దేశ ప్రయోజ నాలను, అటు బ్రిక్స్‌లోని ఇతర దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు బహుముఖ విదేశాంగ విధానం అవసరం. మన భవిష్యత్తును ఎట్టి పరిస్థితుల లోనూ అమెరికా చేతిలో ఉంచకూడదు. ప్రచ్ఛన్న యుద్ధ దౌత్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయడానికి సమయం ఆసన్నమైంది. చైనా దారిని అనుసరించాల్సి ఉంటుంది. అదే సమయంలో అంతర్గత విభే దాలను కొంతకాలం పక్కన పెట్టాలి. ట్రంప్ దుందు డుకు చర్యలకు వ్యతిరేకంగా ఇతర దేశాలతో వ్యవసాయ సంబంధాలను పటిష్ట వంతం చేసుకోవాలి. మన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేలా చైనాతో చర్చలు జరిపితే రెండు దేశాలకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.
బ్రిక్స్ దేశాలకు చేరువై వాటితో సంబం ధాలు పెంచుకోవాల్సి ఉంటుంది. రష్యా చమురు, సహజ వాయువు మన దేశీయ అవసరాలను తీర్చగలవు. చైనా సాయంతో అనేక ముఖ్యమైన అవసరాలు కూడా తీరతాయి. మన ఎగుమతులకు చైనా, రష్యాలు మళ్లీ మార్కెట్లు అవుతాయి. యూర ోపియన్ యూనియన్, ఇతర బ్రిక్స్ దేశాలను మనం లక్ష్యంగా ఎంచుకుంటే దీర్ఘకాలంలో మన లాభాలను నిలుపుకోవచ్చు. బ్రిక్స్ వేదిక ద్వారా భారత్ మరో అలీనోద్యమానికి పిలుపు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనం అమెరికా పెత్తనాన్ని తిప్పికొట్టగలం. అదే సమయంలో మన రైతుల ప్రయోజనాలు కాపాడగలం.
బ్రెజిల్‌తో ఒప్పందం
ఒక్క మాటలో చెప్పాలంటే చైనా ఎదురు దాడి అమెరికాలోని అన్ని వ్యవసాయ ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. రైతులను జప్తుల భయం వెంటాడుతోంది. 1980లో వచ్చిన వ్యవసాయ సంక్షోభం తర్వాత ఇదే అతి పెద్ద ఉపద్రవమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి దిగుమతులను నిలిపివేస్తున్న చైనా అదే సమయంలో సోయాబీన్, జొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల కోసం బ్రెజిల్‌తో ఒప్పందం చేసుకుంది. తద్వారా అమెరికా డిమాండ్లకు తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై చైనా దెబ్బ
- Advertisement -
- Advertisement -