Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఒక్క పైసా చార్జీ పెంచలేదు

ఒక్క పైసా చార్జీ పెంచలేదు

- Advertisement -

గ్రీన్‌ ఫీ పేరుతో ఆర్టీసీ చేసినవి స్వల్ప సవరణలే : మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో ఒక్క పైసా ఛార్జీ పెంచలేదని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ గ్రీన్‌ ఫీతో స్వల్పంగా మాత్రమే సవరణలు చేసిందని చెప్పారు. ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలంటే డిపోలో ఛార్జింగ్‌ స్టేషన్లు, హైటెన్షన్‌ లైన్‌తో పవర్‌ కనెక్షన్‌తో ఒక్కో ఛార్జింగ్‌ స్టేషన్‌కు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. కాలుష్యం తగ్గించడానికి హైదరాబాద్‌లో 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 265 ఈవీ బస్సులు నడుపుతున్నామనీ, రాబోయే 3 నెలల్లో ఇంకా 275 ఇవి బస్సులు వస్తాయని చెప్పారు. గతంలోనే ఎలక్ట్రిక్‌ బస్సుల ఒప్పందం జరిగిందనీ, ఆ మేరకు ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వివరించారు. ప్రజలకు ఇబ్బం దుల్లేకుండా ఛార్జీల సవరణలు జరిగాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణంతో 250 కోట్ల సార్లు మహిళలు ప్రయాణించారని తెలిపారు. ఆర్టీసీని నష్టాల నుంచి లాభా ల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ఎజెండాతో ముందు కెళ్తున్నట్టు స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకంతో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంటే కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ, పీఎప్‌, సీసీఎస్‌ బకాయిలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. రూ.110 కోట్లతో ఆర్టీసీ బస్‌స్టేషన్ల ను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రెండేండ్లల్లో ఆర్టీసీ కార్గోతో మంచి ఆదాయం వస్తున్నదని తెలిపారు. రెండు బస్‌స్టేషన్ల నిర్మాణం, కారుణ్య నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు అన్నారు.

ప్రయివేటీకరించాలని ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌
ఆర్టీసీని ప్రయివేటీకరించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బంద్‌ లు, నిరసనలపై ఉక్కుపాదం మోపుతూ బలితీసుకున్న వారే ఛలో బస్‌భవన్‌ పేరుతో మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లు ఆర్టీసీని నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌ ఒక్క బస్సు కొత్తగా కొనుగోలు చేయలేదనీ, ఒక్క ఉద్యోగ నియామకం చేపట్టలేదనీ, రిటైర్డ్‌ ఈడీని నియమించిందని తెలిపారు. ఒక్క సంతకంతో 48 వేల మందిపై వేటు వేస్తామని వారే హెచ్చరించారని మంత్రి గుర్తుచేశారు. అదే బీఆర్‌ఎస్‌ మళ్లీ ఆర్టీసీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్ని స్తున్నదని తెలిపారు.సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -