– ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌ల కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో రైతుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. వారి ప్రయోజనాల కోసం ఎలాంటి విధానాలను రూపొందించడం లేదన్నారు. భారత వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలతో ఈ దేశంలోని లక్షలాది మంది రైతు కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి, రొయ్యలపై విధించిన సుంకాలపై బీజేపీ ప్రభుత్వం నోరుమెదపడం లేదన్నారు. వాటిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డుమీదకు వచ్చే ప్రమాదముందని చెప్పారు. వచ్చేనెల 26న జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం సూర్య నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు వై కేశవరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
టారిఫ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES