ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆలేరు మండల పరిధిలో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభం కానున్నదని ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నారు.జడ్పిటిసి రిటర్నింగ్ అధికారిగా వెంకటరామిరెడ్డి,ఎంపీటీసీ ఇద్దరు రిటర్నింగ్ అధికారి గా ఇరిగేషన్ ఎ.ఈ విజయ్ కుమార్, కరుణాకర్ నామినేషన్ ప్రక్రియ పరిశీలిస్తారని తెలిపారు. ఎన్నికల అధికారులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ తదితర కార్యక్రమాలకు సన్నద్ధమవుతుమన్నారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని పాటించాలని అధికారులు సూచించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు నేటి నుండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES