Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పనులకు బ్రేక్.!

ప్రభుత్వ పనులకు బ్రేక్.!

- Advertisement -

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
నవతెలంగాణ – మల్హర్ రావు

స్థానిక సంస్థలఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు, ప్రారంభోత్సవ కార్య క్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కొత్త పనులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలకు ఆటంకం ఏర్ప డటంతో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశించిన వారికి నిరీక్షణ తప్పేలా లేదు. ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం పెద్ద సంఖ్యలో లబ్ధిదారు లను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభంలోనే నిలిచాయి. మొదటి విడతలో దాదాపు అన్ని గ్రామాల్లో అర్హులను ఎంపిక చేశారు. ఇప్పటికే కొందరు ప్రారంభించగా,కొంతమంది ప్రారం భించేందుకు డబ్బులు లేక, వర్షాకాలం ఇంటి నిర్మా ణ సామగ్రిని తరలించేందుకు తదితర ఇబ్బందుల తో ప్రారంభించలేదు.

వర్షాలు తగ్గిన వెంటనే నిర్మా ణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం కింద కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడంతోపాటు నిధులు విడుదల చేయడానికి వీలు లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరైన లబ్దిదారులు ఆం దోళన చెందుతున్నారు. ఇప్పటికే వివిధ కారణాల తో ఆలస్యం కాగా ఇందిరమ్మ పథకానికి ఎన్నికల కోడ్ మరో అడ్డంకిగా మారిందని వాపోతున్నారు. తాత్కాలిక నిలిపివేతతో భవన నిర్మాణ కార్మికులకు, సప్లయర్స్కు పని దొరకని పరిస్థితి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -