- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రెండు రోజులు వాదనలు విన్న హైకోర్టు, జీవోతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే ఇచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో నెల పాటు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడనుందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -