నవతెలంగాణ -పరకాల
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెవిలో పూలతో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను అన్ని రకాలుగా మోసం చేస్తుందన్నారు. విద్యార్థుల సంబంధించిన 8 వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్ పెండింగ్లో ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి పని చెయ్యాలన్నారు. లేని యెడల రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్,శివ, జశ్వంత్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
చెవిలో పూలతో ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES