- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని వరద బాధితుల కాలనీతో పాటు తపాలాపూర్ అనుబంధ కొలాంగూడ గ్రామంలో గురువారం పీఎం జన్మాన్ సంచార వైద్యశాల ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య బాబు ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వివిధ వ్యాధుల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ పాల్గొన్నారు.
- Advertisement -