Friday, October 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅతిపెద్ద ఆర్థికశక్తిగా భార‌త్ ఎదగాలి: యూకే ప్రధాని

అతిపెద్ద ఆర్థికశక్తిగా భార‌త్ ఎదగాలి: యూకే ప్రధాని

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యూకే ప్రధాని భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘2028 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు గానూ ప్రధాని మోదీ నాయకత్వానికి అభినందనలు. ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వికసిత్‌ భారత్‌ స్ఫూర్తితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుంది. ఈ ప్రయాణంలో మేమూ భాగం కావాలనుకుంటున్నాం’ అంటూ యూకే ప్రధాని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -