ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ
నవతెలంగాణ – పరకాల
విద్యార్థుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన బీసీ హాస్టల్ వార్డెన్ అందె రవిపై తక్షణమే శాఖపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హాస్టల్ వార్డెన్ రవి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ దృష్టికి వచ్చిన వెంటనే మీడియాతో కలిసి బహిరంగంగా అతడిని పట్టుకున్నప్పటికీ అధికారులు అతనిపై చర్యలు చేపట్టడంలో ఎందుకు ఉదాసీనత చూపిస్తున్నారంటూ శంకర్ అధికారులను ప్రశ్నించారు.ఉన్నత అధికారులు అక్రమ దారులకు వంద పాడడం చూస్తుంటే అనేక అనుమానాలుకు దారితీస్తుందని శంకర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ బియ్యం పక్కదారి పట్టించే వార్డెన్ రవిపై చర్యలు చేపట్టాలని లేనట్లయితే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయమై అడిషనల్ కలెక్టర్ వెంక రెడ్డి స్పందిస్తూ 24 గంటల్లో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారని శంకర్ మీడియాకు వెల్లడించారు.
హాస్టల్ వార్డెన్ పై చర్యలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES