కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
నవతెలంగాణ – పెద్దవంగర
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్, వడ్డెకొత్తపల్లి, కొరిపల్లి, పెద్దవంగర ఎంపీటీసీ ల క్లస్టర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని వెల్లడించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే పరమావధి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయం కోసం నాయకులు అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెహ్రూ నాయక్, ప్రవీణ్ కుమార్, మురళీ, గోపాల్ నాయక్, శ్రీనివాస్, హరికృష్ణ, రవీందర్ రెడ్డి, సైదులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES