ఏపీఎం లక్ష్మీ నరసమ్మ
నవతెలంగాణ – మిరుదొడ్డి
రైతులు కొనుగోలు కేంద్రంలో సృజన చేసుకోవాలని ఏపీఎం లక్ష్మీ నరసమ్మ అన్నారు. గురువారం మిరుదొడ్డి అంబర్పేట భూంపల్లి మండలంలో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు వారి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరకు రైతు ఖాతాలో 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం తెలిపారు.
రైతులు దళాలను ఆశ్రయించకుండా గ్రామాల్లో నిర్వహించిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏ గ్రేడు 2389రూ, బి గ్రేడు 23 69 రూపాయలు నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులు దళాలను ఆశ్రయించకుండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు బాలరాజు ఈశ్వరమ్మ వరలక్ష్మి జ్యోతి ప్రభాకర్ తో పాటు వివిధ గ్రామాల వివో లీడర్లు వివో ఏలు తదితరులు పాల్గొన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES