ఆలయ ఈవో రమాదేవి స్పష్టీకరణ..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆలయ ఈవో ఎల్. రమాదేవి గురువారం స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ఆలయం మూసివేస్తారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మరాదుఅని స్పష్టం చేశారు.
అలాగే ఆలయానికి సంబంధించిన ఏవైనా అధికారిక నిర్ణయాలు తీసుకున్నపుడు అవి ప్రెస్ నోట్ ద్వారా మాత్రమే ప్రకటించబడతాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాజన్న ఆలయంతో పాటు భీమన్న గుడిలో అభివృద్ధి, విస్తరణ పనులు సజావుగా కొనసాగుతున్నాయని ఈవో రమాదేవి పేర్కొన్నారు.ఆలయ పనులు జరుగుతున్నప్పటికీ భక్తుల దర్శనాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆమె భరోసా ఇచ్చారు.