- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలోనే తాజా నిర్ణయం వెలువడింది. ‘రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్నహస్తం అందించింది’ అని జైశంకర్ పేర్కొన్నారు. వాణిజ్యం, మానవతా సాయం కోసం ఆ దేశంలో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ (Technical Mission) ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు.
- Advertisement -