రామారెడ్డి విద్యుత్ ఏ ఈ తీరే వేరు..
గోప్యతలో ఆంతర్యం ఏంటి
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో శుక్రవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫోరం నిర్వహించారు. కానీ సంబంధిత అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రచారాన్ని చేయకపోవడం , గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ డి ఈ నరేష్ కుమార్ పేరు మీద వాట్సాప్ లో పోస్ట్ చేసిన దానికి, కార్యక్రమం నిర్వహించిన దానికి పొంతన లేకుండా పోయింది. కార్యక్రమానికి రామారెడ్డి, సదాశివ నగర్, మాచారెడ్డి, పాల్వంచ మండలాల వినియోగదారులు ఉపయోగించుకోవలసిన కార్యక్రమాన్ని గుట్టు చప్పుడుగా నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ చైర్ పర్సన్ నిజామాబాద్ నారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ , ఫైనాన్షియల్ మెంబర్ కిషన్, ఫోర్త్ మెంబర్ రాజా గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్న, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన, స్థానిక అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతో , ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి రాకపోవడంతో, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్యలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెప్పేదొకటి.. చేసేది మరోటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES