- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని బోల్లేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి నుండి అక్రమ మట్టి తరలింపు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామస్తులు శుక్రవారం తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలోని సర్వేనెంబర్ 280 లో గల ప్రభుత్వ భూమి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని భారీగా తరలిస్తున్నారని గురువారం రాత్రి సమయాలలో భారీ టిప్పర్లలో మట్టిని అక్రమంగా అడ్డుకొని పోలీసులకు అప్పగించామని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో రవీందర్ రెడ్డి, శివ, యాదయ్య, విక్టర్, ఉపేందర్, నవీన్, సైదులు, సమ్మయ్య ఉన్నారు.
- Advertisement -