నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని మార్చాపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రం పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ లో కాపరు వైరు చోరీకి గురయింది. గ్రామంలోని దరిపెల్లి సమ్మయ్య వ్యవసాయ భూమి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను రాత్రి వేళ దొంగలు కిందకు దించి పగులగొట్టి కాపరు వైరును చోరీ చేశారని రైతు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా రంగాపూర్ రెవెన్యూ పరిధిలో రాఘవపట్నం రహదారి వెంట దవుల స్వప్న పల్లెకారి సరిత పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ను కూడా రాత్రివేళ దొంగలు ధ్వంసం చేసి కాపర్ వైర్ ను గెలిచినట్లు పసర పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ముందు ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.