- Advertisement -
- విద్యుత్ శాఖ ఏఈఈ శ్రీనివాసరావు..
నవతెలంగాణ – రాయపోల్ - రాయపోల్ మండల పరిధిలోని రాయపోల్, అనాజీపూర్ సబ్ స్టేషన్ లలో చేపట్టనున్న మరమ్మత్తుల కారణంగా ఈ రెండు సబ్ స్టేషన్ పరిధిలోగల రాయపోల్, తిమ్మక్ పల్లి, కొత్తపల్లి, అనాజీపూర్, మంతూర్ గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాలో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని రైతులు, గ్రామస్తులు సహకరించాలని పేర్కొన్నారు.
- Advertisement -