Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్రయించాలి

కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్రయించాలి

- Advertisement -

నవతెలంగాణ -రాయపోల్
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు  కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని తహసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీవో జేమ్లా నాయక్, ఏపీఎం యాదగిరి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం రాయపోల్, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్, టెంకంపేట,ఆరేపల్లి,వడ్డేపల్లి, అనాజీపూర్, మంతూర్, తిమ్మక్ పల్లి, చిన్నమాసాన్ పల్లి, కొత్తపల్లి, ఎల్కల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దళారులను నమ్మి తక్కువ ధరకు దాన్యం విక్రయించి మోసపోవద్దని, ఐకేపీ, పిఎసిఎస్ ఆధ్వర్యంలో గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు అందరు ఆయా కేంద్రాల్లో  ధాన్యం విక్రయించాలన్నారు.

మండల పరిధిలో మొత్తం 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం వానకాలంలో పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని అన్నదాతలు అధైర్యపడవద్దన్నారు. రైతులు పంటను కోసిన వెంటనే తమ పొలాల వద్దనే ఆరాపెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అధికారులు ధాన్యం తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 41 కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలి అధికంగా తూకం వేసినట్లు తమ దృష్టికి వస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2389/- బి గ్రేడ్ వరి ధాన్యానికి 2369/- రూపాయల మద్దతు ధరను కేటాయించి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు అధైర్యపడవద్దు పండించిన పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాజమల్లు, సీనియర్ అసిస్టెంట్ ముత్తాలిఫ్, ఏఈఓలు ప్రవీణ్, రజిత, సీసీలు నాగరాజు, కుమార్, రోజా, అంజమ్మ వివోఏలు మల్లేశం, నర్సింలు, సుభద్ర,నరేందర్ రెడ్డి, విజయ,భాను,లావణ్య, రేణుక, బిక్షపతి,శోభ, మండల సమైక్య కోశాధికారి సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -