Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు.. ముగించారు

నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు.. ముగించారు

- Advertisement -

24 గంటల్లోనే నిలిచిపోయిన నామినేషన్ ప్రక్రియ..
11 కౌంటర్లు ఏర్పాటు చేసిన రాని ఒక్క నామినేషన్..
కోర్టు స్టే ఇవ్వడంతో నిలిచిన ప్రక్రియ..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొరకు గురువారం నాగిరెడ్డిపేట మండలంలో నోటిఫికేషన్ జారీ చేశారు అదేవిధంగా నామినేషన్ స్వీకరించడానికి 11 కౌంటర్లను ఏర్పాటు చేసి పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. నోటిఫికేషన్ విడుదల చేసి 24 గంటల్లోనే కోర్టు నుండి స్టీల్ అవడంతో నోటిఫికేషన్ ప్రక్రియ నిలుపుదల చేశారు.  నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే పల్లెల్లో  వాతావరణమంతా వేడెక్కింది. ఒక్కసారిగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నామినేషన్ వేయడానికి ఆయా గ్రామాల నుండి సిద్ధమైన అభ్యర్థులు ఒక్కసారిగా ఆగిపోయారు. కోర్టు తీర్పు స్టే రావడంతో ఒక్కసారిగా అభ్యర్థులంతా కంగుతిన్నారు. కోర్టు నాలుగు వారలకు విచారణ వాయిదా వేయడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంలో గ్రామాల్లో సందిగ్ధత నెలకొంది. ఫోటో స్టే విధించడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో నామినేషన్ కొరకు ఏర్పాటు చేసిన ప్రక్రియ నిలిపివేశారు. ప్రభుత్వం నుండి ఎన్నికల నిర్వహణ అధికారుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -