– జిల్లా వైద్యాధికారి రవికుమార్
నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాలలో ప్రసవల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి రవికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది హాజరు పట్టికను, లోపలి రోగుల గదిని ,ప్రసూతి గదిని మరియు మందులు నిల్వంచే గదిని పరిశీలించడం జరిగింది. ఆస్పత్రికి సంబంధించిన వివరాలను వైద్యాధికారి కల్పనను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో కాన్పుల సంఖ్యను పెంచాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని ,ఆస్పత్రిలో సమయసపాలన పాటించాలని తెలిపారు . ఆరోగ్య ఉప కేంద్రంలో కూడా సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కల్పన, ప్రోగ్రాం అధికారి శివ, డిపి ఎం ఓ మధుమోహన్, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసులు, నర్సింగ్ అధికారి రాంపాల్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES