Saturday, October 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనోబెల్ శాంతి బహుమబతిని ట్రంప్‌కు అంకితం ఇచ్చిన మరియా కొరినా మచాడో

నోబెల్ శాంతి బహుమబతిని ట్రంప్‌కు అంకితం ఇచ్చిన మరియా కొరినా మచాడో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతిని బాధల్లో ఉన్న వెనిజువెలా ప్రజలకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు పురస్కార విజేత మరియా కొరీనా మచాడో ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు వెనెజువెలా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడోను ఈ పురస్కారం వరించింది. దీనిపై తాజాగా మచాడో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.

ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతోపాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు. వెనిజువెలా ప్రజల లక్ష్యానికి ట్రంప్ నిర్ణయాత్మకంగా మద్దతిచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరియా పోస్టులో వెల్లడించారు. వెనిజువెలా ప్రజల పోరాటానికి దక్కిన ఈ గుర్తింపు తమ కర్తవ్యాన్ని ముగించడానికి ఒక ప్రోత్సాహకమని పేర్కొన్నారు. స్వేచ్ఛ పొందేందుకు దోహదపడుతుందన్నారు. విజయానికి చేరువలో ఉన్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -