- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్టే విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.
- Advertisement -