- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ వేల కోట్ల రూపాయల రుణాల మోసాలకు సంబంధించిన కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. అనిల్ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అశోక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -