Saturday, October 11, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ ఎన్నిక‌లు..సీట్ల పంప‌కాల‌పై ఎన్డేయే కూట‌మి త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌

బీహార్ ఎన్నిక‌లు..సీట్ల పంప‌కాల‌పై ఎన్డేయే కూట‌మి త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో సీట్ల పంపకంపై ఎన్‌డీఏ కూట‌మిలో పీకులాడుకుంటున్నాయి. జాతీయా మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌కుచెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 40 నుంచి 50 సీట్లను కోరగా, బీజేపీ ఆ పార్టీకి 20 నుంచి 25 సీట్లను ఆఫర్ చేసింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 15 సీట్లలో పోటీకి ఉత్సాహం చూపింది. అయితే ఎన్‌డీఏ కేవలం ఏడు నియోజకవర్గాలను మాత్రమే ఆ పార్టీకి ఇచ్చింది.బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం సీట్ల కేటాయింపు ఇలా..

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 100 సీట్లు
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 26 సీట్లు
హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 7 సీట్లు
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -