Saturday, October 11, 2025
E-PAPER
Homeజాతీయంఇండిగో విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం

ఇండిగో విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. మధురై (Madurai) నుంచి చెన్నై వచ్చిన విమానం ల్యాండింగ్‌కు ముందు విండ్‌ షీల్డ్‌కు పగుళ్లు వచ్చాయి. గమనించిన పైలట్‌ ఈ విషయాన్ని వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం విమానం చెన్నై ఎయిర్‌పోర్ట్‌ లో సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో మొత్తం 76 మంది ప్రయాణికులున్నారు.అక్కడ ప్రయాణికులను సురక్షితంగా దింపేసినట్లు వివరించారు. విండ్‌షీల్డ్‌ను మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తాజా ఘటనతో విమానం మధురైకి తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఇండిగోకు చెందిన విమానం 76 మంది ప్రయాణికులతో మధురై నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే, మరికాసేపట్లో విమానం ల్యాండ్‌ అవుతుందనంగా విండ్‌ షీల్డ్‌కు పగుళ్లు కనిపించాయి. అప్రమత్తమైన పైలట్‌ ఈ విషయంపై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని పార్కింగ్‌ కోసం ప్రత్యేక బేకు తరలించినట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -