నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..
సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..
సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి..
నవతెలంగాణ- గద్వాల
కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికై ఐక్య పోరాటాల శరణ్యమని ఐక్య పోరాటాల కోసం కార్మికులంతా కలిసి రావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం వడ్డేపల్లి మండలం శాంతినగర్ కేంద్రంలో సంజీవరాజు అధ్యక్షతన జరిగిన సిఐటియు వడ్డేపల్లి మండల రెండవ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెడుతోందని అందులో భాగంగానే ఏళ్ళ తరబడి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందని అన్నారు. లేబర్ కోడుల వల్ల కార్మికులకు తీరని నష్టం జరుగుతోందని కనీసం సంఘం పెట్టుకునే హక్కు కూడా లేకుండా పోతుందని అన్నారు.
కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని 26 వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆ సంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల చివరి వారంలో జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా మహాసభలు జరగబోతున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సమావేశంలో అంగన్ వాడి వర్కర్లు, ఆశ వర్కర్లు, హమాలీలు, మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు, ఆటో, భవన నిర్మాణ కార్మిక రంగాల నుండి కార్మికులు పాల్గొన్నారు. అనంతరం వడ్డేపల్లి మండల సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్ గా ఏ. సంజీవరాజు, మండల కమిటీ సభ్యులుగా, హమాలీ భీమన్న, వేణు, మున్సిపల్ శివన్న, కృష్ణవేణి, అంగన్వాడి నుండి ఫరీదా బేగం, ఆశా వర్కర్ల నుండి మమత, డ్రైవర్స్ యూనియన్ నుండి వాసు, బుక్ కీపర్ ల నుండి కృష్ణారావు, తో పాటు 11 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలో సలోమి, పద్మ, రేణుక, బిసమ్మ, వసంతమ్మ కృష్ణవేణి, మధు, రమేష్, మద్దిలేటి, బుచ్చన్న, జయన్న, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.