- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కలవకుర్తి పట్టణంలో సత్యసాయి బాబా దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ తో కలిసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ మనీలా సంజు కుమార్ యాదవ్, పడకంటి వెంకటేష్, సత్య సాయి బాబా భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
- Advertisement -