Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలికలు హక్కులను తెలుసుకోవాలి.!

బాలికలు హక్కులను తెలుసుకోవాలి.!

- Advertisement -

సామాజిక కార్యకర్త డాక్టర్, లుబ్న సర్వత్
నవతెలంగాణ – మల్హర్ రావు

బాలికలు తమ హక్కులు తెలుసుకొని వాటిని సాధించుకోవాలని సామాజిక కార్యకర్త,ఆర్టీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ లుబ్న సర్వత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకంక్షాలు తెలిపి మాట్లాడారు. అంతర్జాతీయంగా బాలికల దినోత్సవం నేడు జరుగుతుంది అంటేనే బాలికలకు, వారి హక్కులకు ఎంతో ప్రాధాన్యత ఉందొ తెలుసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులను గురించి విద్యార్థినులు తెలుసుకోని, వాటిని సాధించుకోవాలన్నారు. బాలికలు, మహిళలుభారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. బాలికలు నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, సక్సెస్ స్టోరీలను సెలెబ్రేట్ చేసుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -