Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుమార్తె వివాహ వేడుక

ఘనంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుమార్తె వివాహ వేడుక

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మసూద్ అహ్మద్ (ఎజాజ్) కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఆయన కుమార్తెను ఇక్బాల్ అహ్మద్ కుమారుడు జఫర్ అహ్మద్ తో వివాహం జరిపించారు. అహ్మద్ పురా కాలనీలోని మక్కా మసీదులో నిఖా జరుగగా, నగరంలోని ఏ.ఎన్ గార్డెన్స్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన వివాహ విందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు ఆమీర్ అలీ ఖాన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జావేద్ అక్రమ్, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మైనారిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళికి హాజరైన అతిథులను వధువు కుటుంబీకులు ముఖీత్ అహ్మద్ (మారూఫ్, ఎన్.ఆర్.ఐ), జాకీర్ హుస్సేన్, జావేద్ అహ్మద్ అన్సారీ, సాకిబ్ తదితరులు స్వాగతం పలికారు. ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి వివాహ వేడుకకు హాజరైన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -