Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ది ప్రాజాపాలన కాదు.. వాయిదాల పాలన

కాంగ్రెస్ ది ప్రాజాపాలన కాదు.. వాయిదాల పాలన

- Advertisement -

ఈ ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు
ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు రాలేదు
రైతు రుణమాఫీ మధ్యలోనే ఆపారు
యూరియా సకాలంలో రాలేదు
రాజీవ్ యువశక్తి మొదలే పెట్టలేదు
మహిళలకు రూ.2500 రానేలేదు
నవతెలంగాణ – మక్తల్

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హడావిడిగా ఎన్నికలు నిర్వహించుటకు సిద్ధమైందని ధర్మ సమాజ్ పార్టీ  నారాయణ పేట జిల్లా కన్వీనర్ గువలి శివరాజ్ అన్నారు. మక్తల్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టి న్యాయం చేస్తే మేం స్వాగతిస్తాం.. కానీ న్యాయ నిపుణులతో చర్చించకుండా సాధ్య, అసాధ్యాలు అంచనా వేయకుండా ఎన్నికల జీ.వో తీసుకురావడాన్ని హైకోర్టు స్టె ఇచ్చిందని అన్నారు. దీనివల్ల ప్రజలు అధికారులు అసహనానికి గురవుతున్నారని అన్నారు. దీనివలన ప్రజాధనం వృధా అవుతుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. మీ అసమర్థ పాలనతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని అన్నారు.

ఇది ప్రజా పాలన కాదు.. వాయిదా పాలన అని విసిగిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆపేస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ అందరికి జరగలేదు, యూరియా సకాలంలో రాలేదు, రాజీవ్ యువ శక్తి లేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు అందలేదు, బతకమ్మ చీరలు లేవు, సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవుని ఎద్దేవా చేశారు. ప్రజలకు అవసరమైన ఆయకట్టు రోడ్లు లేవు, అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుటకు కారణం, మేధావులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోక పోవడమే అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సంపూర్ణ పరిపక్వ నిర్ణయాలతో ప్రజలకు సేవ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నారాయణ పెట్ట జిల్లా కన్వీనర్ గువలి శివరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -