Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి 

బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి 

- Advertisement -

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని
నవతెలంగాణ – వనపర్తి 

బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలోని షెడ్యూల్ ట్రైబ్స్ వసతి గృహంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని బాలికలతో సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాటల పోటీలు, బొమ్మలు గీయడం, ఉపన్యాసాలు ఇవ్వడం, నృత్య ప్రదర్శనల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన విద్యార్థులకు, పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, వసతిగృహ నిర్వాహకురాలు పద్మజ, పారా లీగల్ వాలంటీర్ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -