Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చౌట్ పల్లి లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపిక పోటీలు

చౌట్ పల్లి లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపిక పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కమ్మర్ పల్లి జోనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ పాఠశాలల ఎంపిక పోటీలను నిర్వహించినట్లు ఫిజికల్ డైరెక్టర్ నాగేష్ తెలిపారు. అంతర్ పాఠశాలల జూనియర్ వాలీబాల్, సబ్ జూనియర్ కబడ్డి బాల బాలికల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎంపిక పోటీలకు మండల విద్యాధికారి ఆంధ్రయ్య  ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరిగే నిజామాబాద్ జిల్లాస్థాయి క్రీడ పోటీలకు కమ్మర్ పల్లి జోనల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని ఫిజికల్ డైరెక్టర్ నాగేష్ తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో మోర్తాడ్, కమ్మర్ పల్లి, ఏర్గట్ల మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణ్, నాగేష్, శ్యామ్, ప్రేమ్ ఆనంద్, రమేష్ గౌడ్, మాధురి, జ్యోతి, స్వప్న, బాలు సంజీవ్, పాల్గొని క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి  ప్రధానోపాధ్యాయులు కే. శ్రీనివాస్, ఉపాధ్యాయులు బంతిలాల్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -