Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి ఇమ్మడి గోపి ముదిరాజ్ దరఖాస్తు..

కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి ఇమ్మడి గోపి ముదిరాజ్ దరఖాస్తు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ ఆదివారం కాంగ్రెస్ భవన్‌ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ధరఖాస్తు తోపాటు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత చేసిన పదవులను  బయోడేటా ను దరఖాస్తుల ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్ మాట్లాడుతూ డిసిసి పదవికి దరఖాస్తు చేసుకున్నానని, తను చేసిన పదవులు అన్నింటిని ప్రస్తావించడం జరిగిందని ఇప్పటికే ఇదే విషయమై టీ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా ఇన్చార్జి మంత్రికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తోపాటు ఇతర ఎమ్మెల్యేలకు, నాయకులకు డిసిసి అధ్యక్ష పదవి అప్పజెప్తే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విన్నవించినట్లు వివరించారు. 

కార్మిక మంత్రిని కలిసిన ఇమ్మడి గోపి.. 
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి తల్లి మృతి చెందడంతో కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ కుమార్ వచ్చిన సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -