Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదగిరి ఆశయాలను సాధిద్దాం..

యాదగిరి ఆశయాలను సాధిద్దాం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
అమరజీవి ఊదరి యాదగిరి ఆశయాలను సాధించాలని సీపీఐ(ఎం) భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని దుంపల మల్లారెడ్డి స్మారక భవనంలో యాదగిరి 23వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో రైతులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన రాజీలేని పోరాటాలు నిర్వహించారని తెలిపారు. పట్టణంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పనిచేస్తూ మార్కెట్ వ్యవస్థ ఏర్పడాలని, దళారి వ్యవస్థ పోవాలని ఉద్యమించారు.

ఎడ్లబండ్ల కార్మికుల, కట్టే కొట్టే కార్మికుల, పేలాల బట్టిల కార్మికుల, రిక్షా కార్మికుల సమస్యలపైన అనునిత్యం పోరాటాలు నిర్వహించే వాడని వారన్నారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం, ఎర్రజెండా రాజ్యం తోనే పేదల బ్రతుకులు మారుతాయని తెలిపేవాడని వారన్నారు. యాదగిరి ఆశయాలతోనే పట్టణంలో బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గద్దె నరసింహ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శ వర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, కల్లూరి నాగమణి, పట్టణ కమిటీ సభ్యులు వల్దాస్ అంజయ్య, రాంబాబు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -