Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా నివాసం ఉంటున్న వారిని తొలగింపు 

అక్రమంగా నివాసం ఉంటున్న వారిని తొలగింపు 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడు 
మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూములలో అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నివాసముంటున్న నివాసస్తులను మండల అధికారులు ఖాళీ చేయించారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్లలో 69 ఖాళీ ఉండగా వాటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆలస్యం చేయడంతో కొంతమంది ఖాళీగా ఉన్న వాటి తాళాలు తొలగించి అందులో గత కొన్ని రోజుల నుంచి నివాసముంటున్నారు. ప్రభుత్వ గృహాలలో అనుమతి లేకుండా నివాసం ఉంటే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలంటూ తాసిల్దార్ కృష్ణ, ఎంపీడీవో తిరుమల సూచించారు. గత మూడు నెలల నుండి సుమారు 60 నివాస గృహాలలో తాళాలను తొలగించి అందులో నివాసం ఉంటున్నారు. వీరందరిని గుర్తించి కాళీ చేయించి తాళాలు వేశారు.

ప్రభుత్వం పంపిణీ చేయకుండానే డబుల్ బెడ్ రూమ్లలో నివాసం ఉంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తక్షణమే కాళీ చేయని వారిపై కేసులు చేయడం జరుగుతుందని సూచించడంతో వారందరిని కాళీ చేయిస్తూ తాళాలు వేశారు. తమకు ఒక 15 రోజుల నుండి నెల రోజులు గడువు ఇవ్వాలంటూ బాధితులు తెలిపినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ప్రభుత్వ ఆస్తులలో నివాసం ఉండడం చట్టరీత్య నేరమని తక్షణమే కాళీ చేయాలంటూ అధికారులు సూచించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు. కొంతమంది కాళీ చేయగా మరో నలుగురు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం 11 గంటల వరకు పూర్తిస్థాయిలో ఖాళీ చేయని వారిపై కేసులు వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -